చిన్నారులకు నిమ్స్ లో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
Actor ProfilePolitician

చిన్నారులకు నిమ్స్ లో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిన్నారులకు నిమ్స్ లో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు
Zee Telugu26 Nov 2026
చిన్నారులకు నిమ్స్ లో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. NIMS Hyderabad: గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పింది నిమ్స్ ఆసుపత్రి. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స అందించడానికి హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) ముందుకు వచ్చింది. అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు అందించాలని నిర్ణయించింది. ఆగస్టు 13వ తేదీ నుంచి పిల్లల గుండె శస్త్రచికిత్సలు పూర్తిగా ఉచితంగా ఉంటాయని నిమ్స్ డైరెక్టర్, ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా నిమ్స్ ఈ ఉచిత శస్త్ర చికిత్సల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకోసం నిమ్స్ ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది. . గత ఐదేళ్లుగా నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమం ఏటా కొనసాగుతోందని డైరెక్టర్ ప్రొఫెసర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 13న ఉచిత గుండె శస్త్రచికిత్సలు ప్రారంభమవుతాయి. అవసరాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తూ, వాక్-ఇన్ పద్ధతిలో పిల్లలను పరీక్షిస్తారని ఆయన వివరించారు. అవసరమైన వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత, శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్స అందిస్తారని ఆయన తెలిపారు. కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారు. లండన్‌కు చెందిన ప్రఖ్యాత పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమణ తన్నశునేని, లండన్ వైద్యుల బృందం, పలువురు సిబ్బందితో కలిసి ఈ శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు. చికిత్స కోసం, సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు NIMS, ఓల్డ్ బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న CT సర్జరీ కార్యాలయాన్ని సందర్శించాలని సిఫార్సు చేశారు. ముందుగా అపాయింట్‌మెంట్ అవసరం లేదు