చిన్న పాత్రతో పెద్ద పారితోషికం
Actor ProfileActor

చిన్న పాత్రతో పెద్ద పారితోషికం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిన్న పాత్రతో పెద్ద పారితోషికం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema25 Nov 2026
చిన్న పాత్రతో పెద్ద పారితోషికం - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్ (Rukmini Vasanth). కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లకే పాన్ ఇండియా సినిమాల హీరోయిన్ గా ఎదిగింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ (Toxic)తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ సినిమా కోసం కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుందంట రుక్మిణి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ‘మెలీసా’ అనే కీలక పాత్రలో కనిపించనుంది. నిజానికి ఇది హీరోయిన్ పాత్ర కాదు. మెయిన్ హీరోయిన్ కియరా అద్వానీ. ఈమెను దాదాపు సెకెండ్ హీరోయిన్ అనుకోవచ్చు. అయినప్పటికీ ఈ చిన్న పాత్ర కోసం ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుందంట రుక్మిణి. యశ్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటించారు. వీళ్లలో రుక్మిణీనే జూనియర్ అని చెప్పుకోవాలి. ఈమెకు 3 కోట్లు ఇచ్చారంటే, కియరా శాలరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమాను ఈనెల 26న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రయిలర్ కు భారీ స్పందన వస్తోంది

చ న న ప త రత ప ద ద ప ర త ష క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in