చైనా ఇటీవల న్యూక్లియర్ సబ్‌మెరైన్ నుంచి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పరీక్షించింది. డమ్మీ వార్ హెడ్‌తో ఈ క్షిపణి ప్రయోగం చేపట్టినట్లు చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం భూమి మీది నుంచి మాత్రమే కాకుండా.. సముద్ర గర్భం నుంచి సైతం భూమ్మీద ఎక్కడైనా అణు దాడి చేయగల సామర్థ్యం తనకు ఉందని ఈ క్షిపణి ప్రయోగం ద్వారా చైనా ప్రపంచానికి చాటింది. దీంతో పసిఫిక్ మహాసముద్ర జలాల్లోకి చైనా చేపట్టిన అరుదైన ఈ ప్రయోగం అమెరికాతోపాటు దాని మిత్ర దేశాలను కలవరానికి గురి చేసింది. చైనా చివరగా రెండేళ్ల క్రితం పసిఫిక్ జలాల్లో ఓ డమ్మీ వార్ హెడ్‌తో మిస్సైల్ టెస్ట్ చేపట్టింది. 1980 తర్వాత చైనా పసిఫిక్ జలాల్లో క్షిపణి ప్రయోగం చేపట్టడం అదే తొలిసారి.జులై 6న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు చైనా నేవీ ఈ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను పసిఫిక్ మహా సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి పరీక్షించింది. ఈ క్షిపణి తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని నిర్దేశిత ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని చైనా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ జిన్హువా రిపోర్టు పేర్కొంది. చైనా సైన్యం వార్షిక శిక్షణలో భాగంగా ముందే నిర్ణయించిన ప్రకారం ఈ క్షిపణిని ప్రయోగించిందని.. ఇది ఏ దేశాన్ని లేదా సైనిక లక్ష్యాన్ని ఉద్దేశించి చేపట్టిన ప్రయోగం కాదని చైనా స్పష్టం చేసింది.అమెరికాను తాకే సామర్థ్యం..చైనా దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణి అయిన జేఎల్-3 సబ్‌మెరైన్ లాంచ్‌డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ఈ క్షిపణి ప్రయోగంలో వాడి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది నిర్వహించిన మిలటరీ పరేడ్‌లో తొలిసారి ఈ క్షిపణిని డ్రాగన్ ప్రదర్శనకు ఉంచింది. చైనా తీరంలోని సముద్ర జలాల నుంచి ప్రయోగించినా సరే అమెరికాను తాకే సామర్థ్యం ఈ ఖండాతర క్షిపణికి ఉంది. దీంతో
Actor ProfileCelebrity
చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•3 Oct 2026
చైనా అరుదైన క్షిపణి పరీక్ష.. ఉలిక్కిపడిన అమెరికా, మిత్రదేశాలు.. జలాంతర్గామి నుంచి మిస్సైల్ టెస్ట్ ఎందుకు కీలకం