చేతిలో జాతీయ జెండా.. గుండెల్లో బలమైన అజెండా
Actor ProfilePolitician

చేతిలో జాతీయ జెండా.. గుండెల్లో బలమైన అజెండా

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు
Eenadu23 Dec 2026
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘స్త్రీ శక్తికి ఏడాది.. రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమాన్ని

చేతిలో జాతీయ జెండా.. గుండెల్లో బలమైన అజెండా
Eenadu22 Dec 2026
చేతిలో జాతీయ జెండా.. గుండెల్లో బలమైన అజెండా

రాయపూడి: మన చేతిలో జాతీయ జెండా ఉండాలి.. మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్యమంత్రి హాజరై జాతీయజెండాను ఎగుర వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర్య వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్‌తో పాటు బుల్లెట్ ఎస్కార్టు వచ్చింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యమని అన్నారు. వారి త్యాగాలకు నిజమైన నివాళి అంటే దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమేనన్నారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం తీసుకొచ్చింది. నా దేశం, నా బాధ్యత అని ముందుకుసాగాలి. దేశం నాకు ఏం చేసిందని కాదు... దేశానికి నేను ఏం చేయగలనని అందరూ ఆలోచించాలని కోరారు. 2047 నాటికి వికసిత్ భారత్... స్వర్ణాంధ్ర సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు... వికాసం నుంచి వైభవం వైపు ముందుకుసాగాలన్నారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు ఐక్యంగా కలిసి అడుగులు వేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా

చ త ల జ త య జ డ గ డ ల ల బలమ న అజ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in