
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉదయం దినచర్యకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన అధికారిక నివాసంలో నెమళ్లు, సూక్ష్మ జాతి ఆవులతో తాను గడిపిన మనోహరమైన క్షణాలను చూపిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న ఉదయం ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. తాను ఎర్రకోటలో జరిగే వేడుకలకు త్వరగా బయలుదేరుతున్నానని ఆ పక్షులు, పశువులు గ్రహించినట్లున్నాయని, అందుకే తనను కలిసేందుకు అవి ముందుగానే వచ్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ వీడియోలో ప్రధాని తన ఉదయం నడక, వ్యాయామంలో భాగంగా నెమళ్లకు గింజలు తినిపించడం, తన నివాసంలోని సూక్ష్మ జాతి ఆవులను ప్రేమగా నిమరడం వంటివి చూడవచ్చు.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రధాని ఒక సందేశాన్ని జతచేశారు. "ప్రతిరోజూ ఉదయం నా స్నేహితులకు ఆహారం అందించడం నా దినచర్య. నిన్న ఉదయం నేను ఎర్రకోటకు త్వరగా బయలుదేరుతున్నానని అవి గ్రహించినట్లున్నాయి. అందుకే నేను వెళ్లేముందు నన్ను కలవడానికి వచ్చాయి. ఇది ఎప్పటిలాగే చాలా ప్రత్యేకం!" అని ఆయన పేర్కొన్నారు. లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయన ఉదయం వేళల్లో వ్యాయామం చేస్తున్నప్పుడు నెమళ్లు ఆయనతో పాటు ఉండటం సాధారణంగా కనిపిస్తుంది.ప్రధాని మోదీ వద్ద అరుదైన, దేశీయ సూక్ష్మ జాతి పశువులు ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన సూక్ష్మ జాతి ఆవులు కూడా ఉండటం విశేషం. ఈ జాతిని ప్రపంచంలోనే అత్యంత చిన్నవైన