చేతికి చిక్కాడు.. కిటికీకి వేలాడాడు.. బీహార్ రైలులో దొంగకు తగిన శాస్తి
Actor ProfilePolitician

చేతికి చిక్కాడు.. కిటికీకి వేలాడాడు.. బీహార్ రైలులో దొంగకు తగిన శాస్తి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చేతికి చిక్కాడు.. కిటికీకి వేలాడాడు.. బీహార్ రైలులో దొంగకు తగిన శాస్తి
AP7AM5 Nov 2026
చేతికి చిక్కాడు.. కిటికీకి వేలాడాడు.. బీహార్ రైలులో దొంగకు తగిన శాస్తి

కదులుతున్న రైలులో మొబైల్ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించిన ఓ దొంగకు ప్రయాణికులు ఊహించని రీతిలో గుణపాఠం చెప్పారు. కిటికీలోంచి చేయి పెట్టిన దొంగను పట్టుకుని, రైలు తర్వాతి స్టేషన్‌కు చేరుకునేంత వరకు గాల్లోనే వేలాడదీశారు. బీహార్‌లోని బరౌని-కతిహార్ రైల్వే సెక్షన్‌లో ఈ నెల 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.రైల్వే పోలీసుల కథనం ప్రకారం. జనహిత్ ఎక్స్‌ప్రెస్ ఖగారియా జిల్లాలోని మాన్సి స్టేషన్‌లో ఆగి ఉన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్ మీద నుంచి కిటికీ గుండా లోపలున్న ప్రయాణికుడి మొబైల్ ఫోన్ లాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అతడి చేయి పట్టుకున్నారు. ఇంతలోనే రైలు కదలడం మొదలుపెట్టింది. దీంతో ఆ దొంగ తన చేయిని విడిపించుకోలేక, కదులుతున్న రైలు బయట కిటికీకి వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది.మాన్సి స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ అయిన ఖగారియా వరకు సుమారు 15 కిలోమీటర్ల పాటు ప్రయాణికులు అతడి చేయిని వదల్లేదు. మధ్యలో ట్రాక్‌పై ఉన్న దొంగ సహచరులు అతడిని విడిపించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు ఖగారియా స్టేషన్ రాగానే అతడిని కిందకు దించి, అక్కడున్న ప్రభుత్వ రైల్వే పోలీసులకు అప్పగించారు.నిందితుడిని భాగల్పూర్ జిల్లా నౌగచియాకు చెందిన మహ్మద్ ఫఖ్రుద్దీన్‌గా గుర్తించినట్లు జీఆర్‌పీ అధికారులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు