చెక్ బౌన్స్ కేసు.. నటుడు శరత్ కుమార్ కు కోర్టు సమన్లు
Actor ProfileActor

చెక్ బౌన్స్ కేసు.. నటుడు శరత్ కుమార్ కు కోర్టు సమన్లు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చెక్ బౌన్స్ కేసు.. నటుడు శరత్ కుమార్ కు కోర్టు సమన్లు
Chitrajyothy20 Nov 2026
చెక్ బౌన్స్ కేసు.. నటుడు శరత్ కుమార్ కు కోర్టు సమన్లు

చెక్ బౌన్స్ కేసులో నటుడు, బీజేపీ నేత శరత్‌కుమార్‌కు సైదాపేట కోర్టు సమన్లు జారీ చేసింది. తమిళ నటుడు, బీజేపీ నేత శరత్‌కుమార్ (R. Sarathkumar) కు చెక్ బౌన్స్ కేసులో సైదాపేట కోర్టు సమన్లు జారీ చేసింది. రూ.2 కోట్లకు సంబంధించిన చెక్ చెల్లకపోవడంతో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. శరత్‌కుమార్ వద్ద నుంచి రూ.2 కోట్లు తీసుకున్న సమయంలో తనకు చెక్ ఇచ్చారని ఆరోపించారు. ఆ చెక్‌ను బ్యాంకులో జమ చేయగా, ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై శ్రీకృష్ణ సైదాపేట కోర్టును ఆశ్రయించడంతో కేసును విచారించిన న్యాయస్థానం శరత్‌కుమార్‌కు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ కోసం సెప్టెంబరు 10న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో శరత్‌కుమార్ కోర్టుకు హాజరై తన వాదనను వినిపించాల్సి ఉంది. కేసు తదుపరి విచారణ సెప్టెంబరు 10న జరగనుంది

చ క బ న స క స నట డ శరత క మ ర క క ర ట సమన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in