చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
Actor ProfileActor

చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
Sakshi4 Jan 2027
చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి

టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్‌ ఫెర్నాండో డకౌట్‌ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దినేశ్‌ చండిమాల్‌ (4), కమిందు మెండిస్‌ (14) విఫలం కాగా.. కెప్టెన్‌ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్‌ బ్యాటర్‌ సొనాల్‌ దినుష, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ నిరోషన్‌ డిక్‌వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు. అయితే, ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో డిక్‌విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్‌ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్‌ దినుష- నిరోషన్‌ డిక్‌వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్‌, కుశాల్‌ పెరీరా పేరిట ఉండేది. స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు 1. సొనాల్‌ దినుష- నిరోషన్‌ డిక్‌వెల్లా- 146 పరుగులు 2. ఏంజెలో మాథ్యూస్‌- కుశాల్‌ పెరీరా- 135 పరుగులు 3. దినేశ్‌ చండిమాల్‌- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు 4. మహేళ జయవర్దనె- హషాన్‌ తిలకరత్నె- 95 పరుగులు 5. టీఎల్‌ దిల్షాన్‌- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు. ‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి

చర త ర స ష ట చ న శ ర ల క జ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in