చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు
Actor ProfileActor

చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు
Sakshi20 Oct 2026
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్ .. ప్రపంచ రికార్డు

ఇంగ్లండ్‌ గడ్డపై గత రెండు టీ20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈసారి మాత్రం తేలిపోయింది. బ్రిస్టల్‌ వేదికగా గురువారం ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ చేతిలో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే భారత జట్టు 0–3తో కోల్పోయింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కాగా... తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. దీంతో కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన శ్రేయస్‌ అయ్యర్‌కు తీవ్ర నిరాశే మిగిలింది. అయితే, ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో వ్యక్తిగతంగా మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. 49 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. డివిలియర్స్‌ ప్రపంచ రికార్డు బద్దలు ఈ క్రమంలోనే శ్రేయస్‌ అయ్యర్‌.. సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌ గడ్డ మీద కెప్టెన్‌ హోదాలో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌ 47 బంతుల్లో 68 పరుగులు సాధించాడు. ఇక రెండో టీ20లో 37 పరుగులు చేసిన కెప్టెన్‌ సాబ్‌.. మూడో టీ20లో మాత్రం ఐదు పరుగులకే అవుటయ్యాడు. తాజాగా నాలుగో టీ20లో 80 పరుగులతో సత్తా చాటి.. ఇప్పటికి మొత్తంగా 190 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కెప్టెన్‌ హోదాలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్లు 👉శ్రేయస్‌ అయ్యర్‌ (ఇండియా)- 2026లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి 190 పరుగులు (రెండు అర్ధ శతకాలు) 👉ఏబీ డివిలియర్స్‌ (సౌతాఫ్రికా)- 2017లో మూడు మ్యాచ్‌లలో కలిపి 146 పరుగులు (ఒక అర్ధ

చర త ర స ష ట చ న శ ర యస అయ యర ప రప చ ర క ర డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in