భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఇండోనేషియా పర్యటనలో చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు. జకార్తాలో మంగళవారం ఇండోనేషియా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఇరు దేశాల మధ్య ఉన్న నాగరికత, చారిత్రక వారసత్వ సంబంధాలను గుర్తుచేస్తూ, ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉమ్మడిగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన తన ప్రసంగంలో నొక్కిచెప్పారు.భారత్, ఇండోనేషియాలను సముద్రాలు వేరుచేయడం లేదని, చరిత్ర, సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలనే వారధులు రెండు దేశాలను అనుసంధానం చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. రామాయణ, మహాభారత కాలం నుంచి ఇరు దేశాల మధ్య దృఢమైన సాంస్కృతిక బంధం ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా తమకు ఘన స్వాగతం పలికిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు, పార్లమెంట్‌లో ప్రసంగించే అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్‌కు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా ఎన్నికల వ్యవస్థ ఆధునికీకరణకు భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) అభివృద్ధిలో తోడ్పాటునందిస్తామని, అదేవిధంగా ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.భారత ప్రభుత్వ పథకాలను తమ దేశంలోనూ అమలు చేస్తామని గతంలో ఇండోనేషియా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "మిత్రుల మధ్య కాపీరైట్లు ఉండవు" అని మోదీ చమత్కరించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుహృద్భావ వాతావరణానికి ఈ వ్యాఖ్య అద్దం పట్టింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం రెండు దేశాల
Actor ProfilePolitician
చరిత్ర సృష్టించిన మోదీ.. ఇండోనేషియా పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
AP7AM•6 Oct 2026
చరిత్ర సృష్టించిన మోదీ.. ఇండోనేషియా పార్లమెంట్ లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని