చరిత్ర మన్మోహన్ సింగ్ ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది
Actor ProfilePolitician

చరిత్ర మన్మోహన్ సింగ్ ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చరిత్ర మన్మోహన్ సింగ్ ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది
AP7AM1 Dec 2026
చరిత్ర మన్మోహన్ సింగ్ ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది

బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు ఆమె రాసిన ప్రత్యేక వ్యాసంలో... సుప్రీంకోర్టు తీర్పుతో మన్మోహన్ సింగ్‌పై ఇన్నాళ్లూ జరిగిన రాజకీయ కక్షసాధింపులకు, దుష్ప్రచారాలకు తెరపడిందని స్పష్టం చేశారు. "నాడు (2014 జనవరిలో) మన్మోహన్ సింగ్ చెప్పినట్లుగానే చరిత్ర ఆయన పట్ల చాలా దయతో, గౌరవంగా ప్రవర్తిస్తుంది" అని ఆమె గుర్తుచేశారు. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికను ఆమోదిస్తూ, విచారణ పరిధి దాటి వ్యాఖ్యలు చేసిన విచారణ కోర్టు తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడాన్ని సోనియా గాంధీ స్వాగతించారు. మన్మోహన్ సింగ్ సమగ్రతను, మచ్చలేని రాజకీయాన్ని దెబ్బతీసేందుకు అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులు, కొందరు అధికారులు మరియు మీడియా ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రస్తుత మోదీ ప్రభుత్వంపై మండిపడుతూ... సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. యూపీఏ హయాంలో సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి హామీ, విద్యా హక్కు, ఆహార భద్రత చట్టాల ప్రాధాన్యతను వివరిస్తూ.. మన్మోహన్ సింగ్ ప్రశాంతంగా ఉన్నప్పటికీ దేశానికి అత్యంత కీలకమైన సేవలు అందించిన ప్రధానిగా నిలిచిపోతారని కొనియాడారు