అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా కోరుకుంటోందని, అయితే అది సాధ్యం కాకపోతే "ఇరాన్ పని పడతాం" అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ అంత్యక్రియల ఘట్టం ముగిసిన వెంటనే అమెరికా మళ్లీ మాటల తూటాలు పేల్చింది. అంత్యక్రియల సమయంలోనే ట్రంప్ తన వ్యాఖ్యలతో ఇరాన్‌ను రెచ్చగొట్టారు, ఇరాన్ కూడా అదే స్థాయిలో ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే, ట్రంప్ తాజాగా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో అమెరికా - ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలముకుంటాయా? అని అనిపిస్తోంది. ఇరాన్ అంశంపై మాట్లాడిన ట్రంప్ "మేం ఏదో ఒక విధంగా గెలుస్తాం. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం.. లేకపోతే పని పూర్తి చేస్తాం" అని అన్నారు. అయితే తాను యుద్ధం కంటే దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇరాన్‌లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాలని తాను కోరుకోవడం లేదని.. ఇదే విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలని చెప్పారు. తాము అనుకుంటే గంటల వ్యవధిలోనే విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరించారు. "9.1 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడాలని నేను కోరుకోవడం లేదు. అందుకే ఒప్పందమే మంచిదని భావిస్తున్నాను. కానీ అవసరమైతే ఇరాన్‌లోని వంతెనలను గంటలోనే కూల్చేయగలం. వారి ఇంధన సరఫరా వ్యవస్థను, భారీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం మాకు ఉంది, మధ్యాహ్నంలోపే ఇరాన్‌లోని అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్వీర్యం చేయగలం. అది మాకు సాధ్యమని ఇరాన్‌కూ తెలుసు" అని ట్రంప్ హెచ్చరించారు. కొద్ది రోజుల క్రితం కూడా ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన ఇరాన్ అగ్రనేతలందరినీ ఒక్క దెబ్బతో అంతం చేయగలం అని వ్యాఖ్యానించారు. అయితే వెంటనే అలా చేస్తే చర్చలు జరపడానికి ఎవరూ మిగలరు. అందుకే అలా
Actor ProfilePolitician
చర్చలు విఫలమైతే ఇరాన్ కి ఇక నూకలు చెల్లినట్టే .. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Oct 2026
చర్చలు విఫలమైతే ఇరాన్ కి ఇక నూకలు చెల్లినట్టే .. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్