ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
Actor ProfilePolitician

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
HMTV25 Jan 2027
ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Kagaznagar: ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! Kagaznagar: కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. అధిత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలునిర్వహించారుఈసందర్భంగాపట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి బి. అధిత పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ ప్రాంతంలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి రాజీవ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌక్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, అక్కడ శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా బి.అధిత మాట్లాడుతూ యువతకు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించేలా రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. యువతే దేశ భవిష్యత్తు అని నమ్మిన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభమైన S.I.R. ప్రక్రియలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అర్హులైన యువతకు ఫారం–6 దరఖాస్తులను అందజేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. బూత్ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిలోని యువతకు ఓటు హక్కుపై అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఫారం–6 దరఖాస్తు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు

నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
HMTV20 Jan 2027
నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

Nalgonda: నల్గొండలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు! ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

ఘన గ మ జ ప రధ న ర జ వ గ ధ జయ త వ డ కల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in