
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. CM Revanth Independence Day 2026 Speech: జై తెలంగాణ' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్, ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మా గాంధీ అహింసా మార్గం, జవహర్లాల్ నెహ్రూ ప్రజాస్వామ్య పోరాటాలను, మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశంలో జరిగిన హరిత, శ్వేత, నీలి విప్లవాల అభివృద్ధిని ప్రస్తావించారు. గత 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తూ సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే 91 శాతం ఉందనే సానుకూల అంశాన్ని వెల్లడించారు. వ్యవసాయ రంగం.. రైతుల సంక్షేమం.. రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేశామని, సన్న వడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. యాసంగిలో 8,500 కొనుగోలు కేంద్రాల ద్వారా 81,12,000 టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వ్యవసాయంలో తెలంగాణ పంజాబ్‌ను మించిందని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల నీటి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా సాధికారత.. సంక్షేమ పథకాలు.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతిరోజూ 34 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీ, శిల్పారామం వేదికలుగా కల్పిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు.. రేషన్ కార్డులు.. ఎన్నో ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి స్మార్ట్ కార్డుల


