గుర్తుకొస్తున్నాయి' ఈటీవీ విన్ సిరీస్ రివ్యూ
Actor ProfileActor

గుర్తుకొస్తున్నాయి' ఈటీవీ విన్ సిరీస్ రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గుర్తుకొస్తున్నాయి' ఈటీవీ విన్ సిరీస్ రివ్యూ
AP7AM2 Oct 2026
గుర్తుకొస్తున్నాయి' ఈటీవీ విన్ సిరీస్ రివ్యూ

మొదటి నుంచి కూడా ఈటీవీ కుటుంబ బంధాలు .. ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథలకు ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. గతంలో సినిమాలు .. సీరియల్స్ విషయంలో మాత్రమే కాదు, ఇప్పుడు వెబ్ సిరీస్ ల విషయంలోను అదే పంథాను అనుసరిస్తోంది. అలా ఇప్పుడు ఈటీవీ విన్ కి 'గుర్తుకొస్తున్నాయి' అనే వెబ్ సిరీస్ వచ్చింది. విరాజ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వినోద్ గాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 'కాకినాడ'లో స్కూల్ డేస్ నుంచి సంతోష్ ( విరాజ్) ఆనంద్ .. శ్రీకాంత్ .. గణేశ్ .. మంచి స్నేహితులు. చిన్నప్పుడు చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా, ఆటపాటల్లో చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఒకానొక సందర్భంలో మిగతా ముగ్గురు మిత్రులకు సంతోష్ దూరమైపోతాడు. సంతోష్ కి వైశాలి(యశశ్రీ రావు)తో పెళ్లి కుదురుతుంది. స్కూల్ డేస్ నుంచి మొదలైనవారి ప్రేమ ఫలిస్తుంది. అప్పట్లో ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా ఉన్న రఘునాథ్ ( ప్రియదర్శిని రామ్) కూతురే వైశాలి. స్కూల్ డేస్ లో చాలా ఆకతాయిగా ఉండే సంతోష్ .. అతని స్నేహితులపై రఘునాథ్ మాస్టర్ కి అస్సలు సదభిప్రాయం ఉండేది కాదు. అందువలన సంతోష్ తో వైశాలి పెళ్లికి అతను అయిష్టంగానే ఒప్పుకుంటాడు. అతను మారిపోయాడని కూతురు పదే పదే చెప్పడంతో కాదనలేకపోతాడు. అయితే చివరి నిమిషం వరకూ సంతోష్ ను పరీక్షించాలనే అతను నిర్ణయించుకుంటాడు. పెళ్లికి మూడు రోజుల ముందు ఊరుదాటి వెళ్లొద్దని వైశాలితో సంతోష్ కి చెప్పిస్తాడు. అయినా సంతోష్ వినిపించుకోకుండా తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం కారులో 'గోవా' బయల్దేరతాడు. మార్గమధ్యంలో ప్రమాదం జరగడంతో, మిగతావాళ్లు సంతోష్ ను హాస్పిటల్ లో చేరుస్తారు. అతను గతం మరిచిపోయాడని చెబుతాడు డాక్టర్. ఆ మాట వినగానే స్నేహితులు .. పేరెంట్స్