
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘MRP – నీకెంత నాకెంత’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘MRP – నీకెంత నాకెంత’ ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య హీరోగా నటించగా, డోనల్ బిష్ట్ కథానాయికగా అలరించనున్నారు. అలాగే వెన్నెల కిషోర్, సుదర్శన్, కసిరెడ్డి రాజ్‌కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృథ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. శ్రవణ్ జేష్ఠ నిర్మాతగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రానికి రాకేష్ కొలాంచి సినిమాటోగ్రఫీ అందించగా, అజయ్ అరసాడ సంగీతాన్ని సమకూర్చారు. మార్థాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. పంచజన్య ఫీచర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్ర సంగీతాన్ని ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వినోదానికి కొత్త నిర్వచనం చెప్పేలా రూపొందిన ‘MRP – నీకెంత నాకెంత’ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. దర్శక నిర్మాత శ్రవణ్ జేష్ఠ మాట్లాడుతూ: “మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విచ్చేసి మాకు అండగా నిలిచిన మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మా సినిమా టీజర్, లిరికల్ వీడియో సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి ఎంతో మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను పూర్తి చేయడానికి తమ సమయం, కృషిని అంకితం చేసిన మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, మొత్తం చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. అందరి సహకారంతోనే ఈ సినిమా ఇంత అందంగా రూపొందింది. ఇప్పుడు మా సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి