గ్రహణం వేళ నిర్లక్షం .. ఆసుపత్రికి పాలైన వందలమంది
Actor ProfilePolitician

గ్రహణం వేళ నిర్లక్షం .. ఆసుపత్రికి పాలైన వందలమంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్రహణం వేళ నిర్లక్షం .. ఆసుపత్రికి పాలైన వందలమంది
Sakshi23 Dec 2026
గ్రహణం వేళ నిర్లక్షం .. ఆసుపత్రికి పాలైన వందలమంది

బెర్లిన్‌: సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవద్దని డాక్టర్లు హెచ్చరికలు జారీ చేసిన మనం లెక్కచేయం.. ఏమవుతుందిలే అని నేరుగా గ్రహణాన్ని చూస్తుంటాం తాజా ఇలాంటి నిర్లక్షం వందల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఐరోపాలో ఇటీవల వచ్చిన సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం ద్వారా పెద్ద సంఖ్యలో జనం ఆసుపత్రికి క్యూ కట్టాల్సి వచ్చింది. అయితే వారికి పెద్ద ‍ప్రమాదమేది లేదని డాకర్లు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవలే ఆగస్టు 12 న ఐరోపా ఖండంలో లో సూర్యగ్రహణం సంభవించింది. దీంతో అక్కడి స్థానిక ప్రభుత్వాలు సూర్యగ్రహాణాన్ని నేరుగా చూడవద్దంటూ సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ (రక్షణ కళ్లద్దాలు) ధరించే దానిని వీక్షించాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది ప్రజలు అత్యుత్సాహం, నిర్లక్షంతో నేరుగా సూర్యగ్రహణాన్ని చూశారు. దీంతోవారు తీవ్రమైన కంటి సమస్యలతో ఆసుపత్రులపాలయ్యారు. బాధితులు ప్రధానంగా కళ్లలో మంట, దృష్టి లోపాలు, కంటి చూపు మందగించడం, తలనొప్పి మరియు కళ్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతూ పెద్దఎత్తున ప్రజలు అత్యవసర చికిత్స కోసం వచ్చారని వైద్య సిబ్బంది తెలిపారు. ఐరోపావ్యాప్తంగా వందల సంఖ్యలో ఇటువంటి కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. జర్మనీ బెర్లిన్‌ బెర్లిన్ నగరంలోని ప్రముఖ ఆసుపత్రులైన చారిటే, వివాంటెస్ వంటి వైద్య కేంద్రాల అత్యవసర విభాగాలకు బాధితులు వరుసకట్టారని అక్కడి వైద్యులు తెలిపారు. అయితే వారిలో చాలా మందికి తాత్కాలిక సమస్యలేనని తీవ్రమైన సమస్యలు ఏవరికి లేవని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు ప్రభుత్వ హెచ్చరికల కారణంగా మెజారిటీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడంతో బాధితుల సంఖ్య పరిమితంగానే ఉండిపోయింది. అయినప్పటికీ, సరైన సోలార్ ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించకుండా సూర్యుడిని నేరుగా చూడటం వల్ల కంటిలోని రెటీనా తీవ్రంగా దెబ్బతింటుందని, దీనివల్ల తాత్కాలికంగా లేదా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఖగోళ అద్భుతాలను వీక్షించే సమయంలో ప్రజలు తప్పనిసరిగా సర్టిఫైడ్ సోలార్