గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్..ఈ రోజు రాత్రికల్లా ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్
Actor ProfilePolitician

గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్..ఈ రోజు రాత్రికల్లా ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్..ఈ రోజు రాత్రికల్లా ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్
HMTV28 Dec 2026
గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్..ఈ రోజు రాత్రికల్లా ఈ పని చేయకపోతే సబ్సిడీ బంద్

LPG Gas: గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్న వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చింది. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఈరోజే ఆఖరి అవకాశంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే గ్యాస్ సబ్సిడీని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే గ్యాస్ కనెక్షన్ వెంటనే రద్దు కాకపోవచ్చు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే నగదు సబ్సిడీ నిలిచిపోతుంది. మళ్లీ ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసే వరకు వినియోగదారులు సాధారణ వాణిజ్య ధరలకు సిలిండర్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది. పన్ను రాయితీలు కూడా పొందే అర్హతను కోల్పోతారు. ఆందోళన చెందకుండా వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. ఇంట్లోనే ఫోన్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయడం ఎలా? * గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు. * ముందుగా మీరు ఉపయోగిస్తున్న గ్యాస్ కంపెనీ అధికారిక మొబైల్ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. * యాప్‌తో పాటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి Aadhaar FaceRD యాప్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. * మీ మొబైల్ నంబర్‌తో యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై కనిపించే e-KYC ఆప్షన్‌ను ఎంచుకోవాలి. * ఫేస్ స్కానింగ్ కోసం కెమెరా యాక్సెస్ ఇచ్చి మీ ముఖాన్ని సరిగ్గా స్కాన్ చేయాలి. * స్కాన్ పూర్తయిన వెంటనే మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది. ఫోన్‌లో ప్రక్రియ పూర్తి కాకపోతే ఏం చేయాలి? మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే సమీపంలోని ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్ లేదా గ్యాస్ ఏజెన్సీని నేరుగా సంప్రదించాలి. ఏజెన్సీకి వెళ్లేటప్పుడు మీ గుర్తింపు కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్ పుస్తకాన్ని

గ య స వ న య గద ర లక ల స ట ఛ న స ఈ ర జ ర త ర కల ల ఈ పన చ యకప త సబ స డ బ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in