
ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడి కలకలం రేపింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). అతను తనను మానసికంగా ఎలా వేధించాడో చెప్పింది. మొత్తం తన కంట్రోల్ లో ఉంచుకోవాలని తనకు నరకం చూపించాడని చెప్పింది. ఆమె తాజా ఇంటర్వ్యూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఇంటర్వ్యూలోని అనేక అంశాలను జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు తమిళ కుర్ర హీరో, మాజీ సూపర్ స్టార్ విక్రమ్ కొడుకు అనేది గుసగుస. ఆమె డైరెక్ట్ గా ధృవ్ విక్రమ్ (Dhurvu Vikram) పేరు చెప్పలేదు కానీ వాళ్ళు రెండేళ్లు డేటింగ్ లో ఉన్నారు అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అందుకే ఆమె తన మాజీ బాయ్ ఫ్రెండ్ గురించి అలాంటి షాకింగ్ విషయాలు చెప్పేసరికి ఆమె ఇంటర్వ్యూ అంత వైరల్ అయింది. ఇప్పుడు ఇంకో విషయం బయట పెట్టింది. ఇద్దరూ పెళ్లి చేసుకొని గంపెడు పిల్లలను కనాలకుందట. 11 మంది పిల్లలను కనాలని ఆమెకి ఇంతకుముందు కోరిక ఉండేదట. కానీ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ తర్వాత పిల్లలను కనాలనే కోరిక కూడా పోయింది అని చెప్పింది