గాన కోకిల జానకికి.. భారతరత్న ఇవ్వాలి! క న్న డ ఇండ స్ట్రీ
Actor ProfilePolitician

గాన కోకిల జానకికి.. భారతరత్న ఇవ్వాలి! క న్న డ ఇండ స్ట్రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గాన కోకిల జానకికి.. భారతరత్న ఇవ్వాలి! క న్న డ ఇండ స్ట్రీ
Chitrajyothy4 Nov 2026
గాన కోకిల జానకికి.. భారతరత్న ఇవ్వాలి! క న్న డ ఇండ స్ట్రీ

ఎస్. జానకి అంత్యక్రియల సందర్భంగా ప్రముఖులు భావోద్వేగ నివాళులు అర్పించారు. జానకికి భారతరత్న ఇవ్వాలని, ఆమె పేరుతో అవార్డు, స్మారకం, అధ్యయన పీఠం ఏర్పాటు చేయాలని పలు ప్రతిపాదనలు చేశారు. గాన కోయిల ఎస్. జానకి (S Janaki) కన్నుమూతతో సజీవంగా దూరమైనా ఆమె పాటల ద్వారా సూర్య చంద్రులు ఉండేదాకా శాశ్వతమని ప్రముఖ గాయకుడు విజయ్ ప్రకాష్ (Vijay Prakash)అన్నారు. జానకి పార్థివదేహాన్ని చూసేందుకు వచ్చిన పలువురు ప్రముఖులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ప్రతిపాదనలు పెట్టారు. ప్రముఖ కన్నడ దర్శకుడు కే. కళ్యాణ్ మాట్లాడుతూ జానకి అమ్మ అంటే సమత- మమత రెండూ కలిగిన వారన్నారు. ఆమె వినమ్రత ఎప్పటికీ మరువలేమన్నారు. జానకమ్మకు భారతరత్నతో గౌరవించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ గాయకురాలు సంగీతాకట్టి మాట్లాడుతూ పాటలద్వా రానే శక్తిని పొందిన సాధకురాలని కొనియాడారు. విధాన పరిషత్ సభ్యుడు రఘు కౌటిల్య మాట్లాడుతూ ఎస్. జానకి పేరుతో పురస్కారాన్ని స్థాపించాలని అదే నిజమైన గొప్పదనమన్నారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ అధ్యక్షులు సాధుకోకిల మాట్లాడుతూ ఆమె కేవలం గాయకురాలు కాదని ఓ తల్లి చూపే ఆప్యాయత, అనురాగం, అభిమానం ఆమె ఎంతోమందికి పంచిందన్నారు. అన్ని భాషలతో కలిపి వందలాది మంది జూనియర్ గాయకులు ఆమెను ఆదర్శంగా భావిస్తారన్నారు. గాయకుడు రాజేష్ క్రిష్ణన్ మాట్లాడుతూ ఆమె సాధన జీవితకాలం ఉండిపోనుందన్నారు. ఆమెతో కలిసి పాడే అదృష్టం లభించడం గొప్ప పురస్కారం లాంటిదన్నారు. సంగీతం, వినయం ఎప్పటికీ శాశ్వతమని నిరూపించారన్నారు. నటుడు వినోద్ రాజ్ మాట్లాడుతూ ఆమె సంగీత ప్రపంచంలో ఊహకు అందనంత ఎత్తుకు ఎదిగారని అయినా ఎక్కడా అహంకారమనేది లేదని కొనియా డారు. నాతల్లి లీలావతి పట్ల ఎంతో అభిమానం చూపేవార న్నారు. ఎమ్మెల్యే హరీష్ గౌడ మాట్లాడుతూ దేశచరిత్రలో మరె వ్వరూ సాధించనంత పరంపరను వదిలి వెళ్ళారన్నారు. ఎమ్మెల్యే చిక్కమాదు మాట్లాడుతూ హెచ్ఎ కోటలో ఆమె లీన మయ్యారని ఇక్కడే స్మారకాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు

గ న క క ల జ నక క భ రతరత న ఇవ వ ల క న న డ ఇ డ స ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in