కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసులో తాజాగా కృష్ణలంక స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నిందితుడిని రెండో ఏజేఎంఎఫ్‌సీ కోర్టులో న్యాయాధికారి శ్రీకాంత్ ఛాంబర్‌లో హాజరుపపరిరచారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన నిందితుల సంఖ్య ఆరుకు చేరింది.హోంగార్డు కోనేటి వెంకటరాజును ఏ 7గా సిట్ అధికారులు చేర్చారు. వెంకటరాజు మిగిలిన నిందితులతో కలిసి నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యాడని రుజువైంది. ముఖ్యంగా కృష్టలంక పోలీస్ స్టేషన్ సీసీ టీవీ కెమెరాల హార్డ్ డిస్క్‌లను మాయం చేశాడనే విషయం విచారణలో అంగీకరించినట్లు సిట్ అధికారులు తెలిపారు. స్టేషన్‌లోకి సాయికృష్ణను అక్రమంగా నిర్బంధించడం, అతనిపై దాడి చేయడం.. అనంతరం ఏ4 సురేష్ సాయంతో మృతదేహాన్ని మాయం చేయడం వంటి విషయాలు నిరూపించే కీలకమైన సీసీటీ దృశ్యాలు మాయం చేశారంటూ అంటూ సిట్ తమ రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించింది."ఈ ఏడాది జూన్ 14న హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, హోంగార్డు వెంకటరాజును సంప్రదించాడు. స్టేషన్ ప్రధాన ద్వారం ఎదురుగా, సెల్లార్ వైపు ఉన్న కెమెరాలను తొలగించాలని సీఐ నాగరాజు ఆదేశించినట్లు వెంకటరాజు తెలిపాడు. సాయికృష్ణను లోపలికి తీసుకురావడం, బయటకు తీసుకెళ్లే దృశ్యాలు ఆ కెమెరాల్లో రికార్డయ్యే అవకాశం ఉందన్నాడు. స్టేషన్‌లోని 10 సీసీ టీవీ కెమెరాలకు ఉంచిన నాలుగు హార్డ్ డిస్క్‌లను తొలగించాలని అశోక్ చెప్పాడు" అంటూ హోంగార్డు వెంటకరాజు వర్షెన్‌ను సిట్ అధికారులు వెల్లడించారు.హార్డ్ డిస్క్‌లు వెంకటరాజు తన బ్యాగులో పెట్టుకుని స్టేషన్ నుంచి వెళ్లిపోయాడని, ఆ సమయంలో అతని కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని సిట్ అధికారులు చెబుతున్నారు. స్టేషన్ సెక్షన్ ఇన్‌ఛార్జి ఎల్‌డబ్ల్యూ 12, సెంట్రీ విధులు నిర్వర్తించిన ఎల్‌డబ్ల్యూ 64 వాంగ్మూలాల్లో అతను ఈ విషయాలను ధ్రువీకరించినట్లు అధికారులు తెలిపారు. వాదనలు విన్న
Actor ProfilePolitician
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. కృష్ణలంక హోంగార్డు అరెస్టు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•13 Dec 2026
గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. కృష్ణలంక హోంగార్డు అరెస్టు, హార్డ్ డిస్క్ మాయంలో ప్రధాన పాత్ర