గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు
Actor ProfilePolitician

గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
శ్రావణమాసం ఎఫెక్ట్.. దెబ్బకు పెరిగిన తమలపాకు ధరలు
Samayam Telugu25 Jan 2027
శ్రావణమాసం ఎఫెక్ట్.. దెబ్బకు పెరిగిన తమలపాకు ధరలు

శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంది. పూజలు, వ్రతాలతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.హిందువులకు శ్రావణ మాసం వచ్చిందంటే పండగ వాతావరణమే. మహిళలు తాము ముస్తాబవ్వడమే కాకుండా ఇంటిని కూడా చూడచక్కని

గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్
Samayam Telugu24 Jan 2027
గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్.. అందమైన బోటు, ఆ లోపల బెడ్డు.. పర్యాటకులకు స్వర్గమే, ఫుల్

కోనసీమ జిల్లాల్లో గోదావరి హొయలను చూస్తుంటే మనస్సు అలా తుళ్లిపడుతుంది. ఒక్కసారి ప్రకృతి మొత్తం మన ముందు పురివిప్పినంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. అలాంటి గోదావరి నది మధ్యలో క్యాండిల్ లైట్ డిన్నర్ అంటే ఒక్కసారి ఊహించుకోండి స్వర్గమే మన ముందున్నట్టు ఉంటుంది కదా. అందమైన బోటు.. ఆ లోపల బెడ్డు.. ఇక సకల సౌకర్యాలు ఆహా ఇలా ఒక్క గంట ఆ ప్రదేశంలో గడిపినా చాలు. ఈ ఫీలింగ్‌ని నిజం చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ నూతన అడుగులు వేస్తోంది.కేరళలాగే రాజమహేంద్రవరంలోనూ హౌస్‌బోటులో ఒక రోజంతా సరదాగా గడిపేలా రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సరస్వతీ ఘాట వద్ద క్యాప్సూల్ ఆకారంలో అత్యాధునిక వసతులతో కూడిన అందమైన హౌస్‌బోటును ఏర్పాటు చేశారు. 15 మంది పట్టే సామర్థ్యంతో ఈ క్యాప్సూల్ ఏర్పాటు చేశారు. కానీ.. భద్రతా కారణాల దృష్ట్యా 8 మందినే అనుమతించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.READ ALSO శ్రీశైలానికి భారీ వరద.. మళ్లీ ఎగువ నుంచి వస్తున్న నీరుబోటు లోపల వసతులుఈ బోటు లోపలే ఒక మంచం, చిన్న ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ, బాత్రూం కూడా ఉంటాయి. గోదావరి నది మధ్యలో పయనిస్తూ చుట్టూ ఉన్న అద్దాల నుంచి ప్రకృతిని రాత్రి వేళ ఆస్వాదించొచ్చు. తీరానికి వంద మీటర్ల దూరం వరకు తీసుకెళ్లి లంగరు వేస్తారు. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో గంట చొప్పున నదీ విహారం ఉంటుంది.ఒకరోజంతా ఉండాలి అనుకుంటేఈ బోటులో ఉండాలి అనుకునే వారికి 24 గంటలకు మామూలు రోజుల్లో సుమారు రూ. 7500, వీకెండ్స్‌లో రూ. 10 వేలు ధర నిర్ణయించేలా పర్యాటక శాఖ చూస్తోంది. ఇక్కడ బస చేసేవారికి ఉదయం టిఫిన్ ఉచితంగా ఇస్తారు.. భోజనం, స్నాక్స్ లాంటివి కావాలంటే ఆర్డర్ ఇస్తే చేసిపెడతారు. ప్రస్తుతానికి అనుమతులు ఇంకా రాలేదని, పర్మిషన్స్ వచ్చిన తర్వాత అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.క్యాండిల్ లైట్ పార్టీ

గ ద వర నద మధ యల క య డ ల ల ట డ న నర అ దమ న బ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in