గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా
Actor ProfilePolitician

గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా
Asianet News Telugu1 Dec 2026
గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. ఎలా బుక్ చేయాలో తెలుసా

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఇండియన్స్ కి ఇబ్బందులు తప్పడంలేదు. ముఖ్యంగా LPG (వంట గ్యాస్) సిలిండర్ల కొరత ప్రజలను వెంటాడుతోంది. ముందుగానే బుక్ చేసినప్పటికీ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అనే ఆందోళన ఉంటోంది. అయితే ఇక గృహిణులను ఆ చింత లేకుండా ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) ఓ ఆసక్తికర స్కీమ్ ను తీసుకువచ్చింది. ఇండియన్ ఆయిల్ 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' అనే కొత్త సర్వీస్‌ను ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు బుక్ చేసిన 3-4 గంటల్లో 10 కిలోల కాంపోజిట్ సిలిండర్‌ను పొందవచ్చు. ఇది బరువు తక్కువగా ఉండటంతో హ్యాండిల్ చేయడం కూడా సులభం. 'IndianOil One' యాప్, ఇండియన్ ఆయిల్ కస్టమర్ పోర్టల్ లేదా 7588888824 వాట్సాప్ నంబర్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసిన 3-4 గంటల్లో సిలిండర్ డెలివరీ అవుతుంది. ఈ కాంపోజిట్ సిలిండర్లు బరువు తక్కువగా ఉండటంతో మోయడం తేలిక. కొత్త కనెక్షన్ కోసం ఎక్కువ డాక్యుమెంట్లు కూడా అవసరం లేదు. గృహిణులను ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వంట మధ్యలో గ్యాస్ అయిపోతే ఏం చేయాలని కంగారు పడక్కర్లేదు. ఇంట్లో అదనపు సిలిండర్ లేకపోయినా 3-4 గంటల్లోనే కొత్త సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. ఈ 'ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ' తత్కాల్ సేవ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య చేసే బుకింగ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత బుక్ చేసే సిలిండర్లను మరుసటి రోజు ఉదయం డెలివరీ చేస్తారు. అంతేకాకుండా ఈ సేవను పొందడానికి కస్టమర్లు సాధారణ సిలిండర్ ధరతో పాటు అదనంగా కొంత తత్కాల్ సేవా రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ 10 కిలోల కాంపోజిట్ సిలిండర్లను తుప్పుపట్టని యాక్రిలిక్ ఫైబర్ గ్లాస్ మెటీరియల్‌తో