
పోలీసులు ప్రయాణించిన కారులో ఉన్న మద్యం, గంజాయి, యూనిఫాం పోలీసుల కారులో గంజాయి వెనుక బయటపడుతున్న నిజాలు గంజాయి దొరికిన కారులో ఓ బ్లూ బ్యాగ్‌లో భారీగా నగదూ ఉన్నట్లు చెబుతున్న గ్రామస్తులు ఆ నగదు పోలీసులకు గ్రానైట్ మాఫియా ఇచ్చిందని అనుమానాలు చంద్రబాబు సర్కారు వచ్చినప్పటి నుంచి భారీగా గ్రానైట్ అక్రమ రవాణా రెండు మాఫియా గ్రూపుల మధ్య రాజీ చేసిన పోలీసులు ప్రతిగా బల్లికురవ నుంచి గురజాల వరకు ఉన్న ఎస్సైలకు గ్రానైట్ మాఫియా భారీ పార్టీ విందుకు ఓ ఉన్నతాధికారీ హాజరైనట్లు గుసగుసలు పార్టీ ఏర్పాటులో ఒక మంత్రి పీఏ, ఓ సీఐ ప్రధాన పాత్ర గంజాయి గుట్టు బయటపడగానే జారుకున్న ఇద్దరు ఎస్సైలు కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్‌లో కేసును నీరుగార్చేందుకు కుట్రలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పోలీసుల కారులో గంజాయి, మద్యం బాటిళ్లు దొరకిన ఘటన వెనుక అత్యంత కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనకు ముందు అధికార కూటమి గ్రానైట్ మాఫియాకు అండదండలందిస్తున్న పోలీసులు అందరికీ మాఫియా పెద్దలు పెద్ద పార్టీ ఇచ్చారని, అందులో పాల్గొని వస్తుండగా పోలీసుల వాహనం ఆటోను ఢీకొనడం, ఆ కారులో గంజాయి, మద్యం బాటిళ్లు బయటపడి.. మొత్తం గుట్టు రట్టయిందని సమాచారం. ఇదే కారులో ఓ నీలం రంగు బ్యాగు కూడా లభ్యమైందని, దానిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఘటన తర్వాత పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు, భిన్నమైన ప్రకటనలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కరకట్ట ప్యాలెస్ డైరెక్షన్‌లో ఈ కేసును నీరుగార్చేందుకు పావులు కదుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో బల్లికురవ ఎస్సై నాగరాజు, సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావును కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు మద్యం