గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది
Actor ProfileActor

గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది
TV9 Telugu10 Oct 2026
గంగూలీని దాదా అని ఎందుకంటారు? రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర అది

ఇండియన్ క్రికెట్ టీమ్ అప్పటికే వరల్డ్ కప్ గెలిచి ఉన్నా.. అదో సాధారణ టీమ్ అనే అలుసు మిగతా టీమ్స్‌కి. టీమిండియానా.. వాళ్లు స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అనే బిరుదులు కూడా ఉండేవి. సచిన్ లాంటి దిగ్గజం జట్టులో ఉన్నా.. పసికూనకు ఎక్కువ, పెద్ద టీమ్‌కు తక్కువ అనే పరిస్థితి. ఇదంతా సరిపోదు అన్నట్లు.. జట్టులో ఫిక్సింగ్ కలకలం. అప్పటి టీమిండియా కెప్టెన్ అజహరుద్దీన్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో భారత క్రికెట్ ప్రతిష్ఠ ఒక్కసారిగా దిగజారిపోయింది. జట్టులో తెలియని నైరాష్యం, అసలు గెలవాలనే తపనే కనిపించేది కాదు. ఆల్ మోస్ట్ వెంటిలేటర్‌పైకి వెళ్లింది ఇండియన్ క్రికెట్. అదిగో అలాంటి టైమ్‌లో వచ్చాడు ఓ యువకుడు. చూసేందుకు అచ్చం సినిమా హీరోలా ఉండేవాడు. కళ్లు మిటకరిస్తూ, ముందుకొచ్చి సిక్సులు కొట్టే బ్యాటర్‌‌గా అప్పటి వరకు అతని గురించి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ.. అతనిలోని ఒక లీడర్ ఉన్నాడని, అతనే టీమిండియా తలరాత మార్చబోతున్నాడని చాలా మందికి అప్పటికీ తెలియదు. ఫిక్సింగ్ ఆరోపణలతో టీమిండియా అంటే బండిని లాగేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సచిన్ కూడా నావల్ల కాదని చేతులు ఎత్తేశాడు. అప్పుడు సౌరవ్ గంగూలీ అనే ఒక యవతేజం ఆ బాధ్యత తీసుకున్నాడు. అప్పటి వరకు గంగూలీగా ఉన్న అతను.. కెప్టెన్ అయ్యాక లోడ్ చేసిన గన్‌లా మారాడు. అయితే గంగూలీగా మొదలైన అతని ప్రస్థానం.. ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా, గాడ్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ నుంచి.. దాదాగా ఎలా మారిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. 1992 జనవరి 11న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన గంగూలీకి ఆరంభం అంత గొప్పగా లభించలేదు. ఆ తర్వాత నాలుగేళ్లకు వచ్చిన అవకాశం ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. 1996 జూన్ 20న ఇంగ్లాండ్‌లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టు అరంగేట్రం చేసిన గంగూలీ తొలి

గ గ ల న ద ద అన ఎ ద క ట ర ర మ ల న క కబ డ చ క న చర త ర అద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in