గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య
Actor ProfilePolitician

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి?.. సామాన్య మహిళా కార్యకర్తకు అవకాశం
Samayam Telugu3 Jan 2027
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, రమాదేవి?.. సామాన్య మహిళా కార్యకర్తకు అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి టీడీపీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు స్థానాలకు టీడీపీ ఎస్సీ, బీసీలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత వర్ల రామయ్య తో పాటుగా రాయలసీమకు చెందిన బీసీ నేత, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోందీ. వీరిద్దరు పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గతంలో ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. దళవాయి రమాదేవి , అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా ఉన్నారు.. ఆమె సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వచ్చి పార్టీ పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే ఈ ఇద్దరి ఎంపికపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.. మంగళవారం కేబినెట్ భేటీలో చర్చించి ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు గుంటూరు, కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పీడీఎఫ్‌ అభ్యర్థిగా ఎం.హనుమంతరావును ప్రకటించారు. హనుమంతరావు 30 ఏళ్లు ప్రభుత్వ టీచర్‌గా సేవలందించి.. గత జూన్‌లో రిటైర్ అయ్యారు. ఆయన యూటీఎఫ్‌లో మండల ప్రధాన కార్యదర్శి నుంచి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. యూటీఎఫ్‌ కూడా హనుమంతరావు అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు వి బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు హనుమంతరావును అభ్యర్థిగా ప్రకటించారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవిపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ రానివారు చాలామంది ఈ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమాతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు పిఠాపురం వర్మ, కొమ్మాలపాటి శ్రీధర్

గవర నర క ట ల ఎమ మ ల స ల గ వర ల ర మయ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in