
తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశాల్లో జనసేన నాయకులు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు దుబాయిలో పలువురు తెలంగాణ యువత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సూచనల మేరకు, గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ జనసైనికులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా, గల్ఫ్ జనసేన ఇన్‌చార్జ్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 20 మంది తెలంగాణ యువత జనసేన పార్టీలో చేరగా, వారికి గల్ఫ్ జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ జనసైనికులు, వీర మహిళలు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించి త్వరలోనే కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ యువతను జనసేన పార్టీకి మరింత చేరువ చేయడం, పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో యువతను భాగస్వాములను చేయడం తమ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. గల్ఫ్ నుంచి తెలంగాణ వరకు పార్టీ కార్యక్రమాలకు అవసరమైన సహకారం, సమన్వయం అందించే విధంగా ముందుకెళతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ జనసేన యూఏఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు నున్నం రాజేష్, పొట్టిపోతు సుబ్రహ్మణ్యం, బండారు శివాజీ, సత్య తోలేటి, పెద్దిరెడ్డి పన్నాల తదితరులు పాల్గొని జనసేన పార్టీలో చేరిన తెలంగాణ యువతను అభినందించారు. పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమిపై తమ బాధ్యతను మరచిపోమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేనతో