గన్ మెన్ లను వెనక్కి పంపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
Actor ProfilePolitician

గన్ మెన్ లను వెనక్కి పంపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
గన్ మెన్ లను వెనక్కి పంపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
TeluguOne8 Oct 2026
గన్ మెన్ లను వెనక్కి పంపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా.. లక్ష్మారెడ్డి వారిని వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా ప్రజల్లో తిరగడమే తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు. సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు.. సీఎం విజయ్ కరూర్ పర్యటనకు తొలగిన అడ్డంకులు.!

గన మ న లన వ నక క ప ప న బ ఆర ఎస ఎమ మ ల య లక ష మ ర డ డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in