
శ్రీనివాస్ యాదవ్‌పై దురుసుగా ప్రవర్తిస్తున్న గన్‌మేన్ నెహ్రూనగర్, న్యూస్‌టుడే: గుంటూరులో శనివారం ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రారంభోత్సవంలో ఓ గన్‌మెన్ అత్యుత్సాహం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. స్టాల్స్ పరిశీలనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు వెళ్లారు. రఘురామ గన్‌మెన్ ఒకరు మంత్రి దుర్గేష్‌ను అడ్డుకోవడంతో శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. గన్‌మెన్ తన మోచేతితో ఆయన గుండెలపై బలంగా కొట్టడంతో నొప్పితో గట్టిగా అరిచారు. తొందరపడొద్దంటూ పెమ్మసాని చెప్పేందుకు ప్రయత్నించారు. కూటమి నాయకులతో గన్‌మెన్ వాగ్వాదానికి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. బోనబోయిన, జనసేన నాయకులు విషయాన్ని రఘురామకృష్ణరాజుకు చెప్పారు. ఘటన తర్వాత నలతగా ఉండటంతో శ్రీనివాస్‌యాదవ్ ఆసుపత్రిలో చేరారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు