ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం
Actor ProfileActor

ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్
NTV Telugu4 Jan 2027
ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్

Khalifa Trailer: ఒక స్మగ్లర్ వారసత్వం, కోట్ల విలువైన బంగారం, రాజకీయ కుట్రలు, చివరికి రక్తపాత ప్రతీకారం. ఈ నాలుగు అంశాల చుట్టూ తిరిగే భారీ యాక్షన్ రివెంజ్ థ్రిల్లర్‌గా ‘ఖలీఫా’ (Khalifa) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ డైలాగ్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ భారీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఖలీఫా’ (Khalifa) ట్రైలర్ ను నిన్న రాత్రి (ఆగస్టు 16) 8:30 గంటలకు ఆఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. వైశాఖ్ దర్శకత్వంలో జిను వి. అబ్రహం కథ అందించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో పృథ్వీరాజ్ ‘మాంబరక్కల్ ఆమిర్ అలీ’ అనే పవర్‌ఫుల్ గోల్డ్ స్మగ్లింగ్ డాన్‌ పాత్రలో గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్సెస్, డైలాగ్స్‌తో అదరగొట్టారు. ఈ హై-వోల్టేజ్ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్‌తో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సరసన మాలవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ‘మాంబరక్కల్ అహ్మద్ అలీ’ అనే అత్యంత పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుండటం ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీ ఓనమ్ (Onam) పండుగ కానుకగా ఈ వారంలోనే అంటే 2026 ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. పృథ్వీరాజ్ గతంలో విడుదల చేసిన ఆమిర్ అలీ చిన్ననాటి లుక్, గ్లింప్స్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే ఉత్సాహాన్ని రెట్టింపు చేయడంతో, ఓణం సందర్భంగా ఖలీఫా బాక్సాఫీస్