
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. US Iran Conflict: ఇరాన్ పై అమెరికా మరోసారి దాడులు చేసింది. హర్ముజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే ఇరాన్ సైనిక స్థావరాలు నౌకాశ్రయాల మౌలిక సదుపాయాలపై విరుచుకు వాషింగ్టన్ విరుచుకు పడింది. ఈ మేకు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ జలమార్గంలో అమాయక పౌరులు ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతికారంగానే ఈ దాడులు చేసినట్టు అమెరికా దళాలు ప్రకటించాయి. ఇరాన్ చమురు విక్రయాలకు సంబంధించిన లైసెన్స్ రద్దు.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ తీర ప్రాంత నిఘా వ్యవస్థ క్షిపని నిలువలు డ్రోన్ల ప్రయోగ స్థావరాలను అమెరికా రక్షన బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల మౌలిక సదుపాయాల పైన దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. మరోవైపు తీర ప్రాంతమైన బందర్ అబ్బాస్‌లో పేలుళ్లు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. నాటో కూటమి శిఖరాగ్ర సమావేశం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుర్కియలో ఉన్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందే చమరు విక్రయాలకు సంబంధించి ఇరాన్ లైసెన్స్ ను అమెరికా రద్దు చేసింది. హర్మూజ్‌లో ఇరాన్ చర్యలు ఆమోద యోగ్యం ఎంత మాత్రం కావని అందుకే లైసెన్స్‌ను రద్దు చేసినట్లు యూఎస్ ప్రకటించింది. ఈ చర్యను ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అంటోంది. దీని