
సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్‌లో తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. నటుడిగా అద్భుతమైన సినిమాలు చేసి మెప్పించారు. ప్రయోగాలకు కేరాఫ్ గా నిలిచారు. సినిమా మేకింగ్ పరంగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ పరిచయం చేసిందంటే కృష్ణ అనే చెప్పాలి. సాహసాలకు మరో పేరుగా పేరుతెచ్చుకున్నారు. అదే సమయంలో నిర్మాతల హీరో అనిపించారు. మాస్ కమర్షియల్ చిత్రాలతో టాలీవుడ్‌ని షేక్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో మాస్ సినిమాలు చేసిన హీరోగా కృష్ణ నిలుస్తారని చెప్పొచ్చు. అయితే ఆయన వారసుల్లో మహేష్ బాబు ఒక్కడే సక్సెస్ అయ్యాడు. పెద్దకొడుకు రమేష్ బాబు సక్సెస్ కాలేకపోయాడు. ఆయన ఫెయిల్యూర్‌కి కారణం కృష్ణనే అట. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు వెల్లడించారు. రమేష్ బాబు బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. `అల్లూరి సీతారామరాజు` ఆయన తొలిచిత్రం. ఇందులో చిన్నప్పటి అల్లూరిగా రమేష్ బాబు నటించాడు. ఆ తర్వాత 1987లో `సామ్రాట్` చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇది యావరేజ్‌గా ఆడింది. `చిన్ని కృష్ణుడు` ఫర్వాలేదనిపించింది. `బజార్ రౌడీ` మంచి హిట్ అయ్యింది. `ముగ్గురు కొడుకులు` హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత రమేష్ బాబుకి సోలో హిట్ లేవు. వరుసగా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీనికి కారణం సూపర్ స్టార్ కృష్ణనే అంటున్నారు విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్. రమేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్న సమయంలో కృష్ణ కూడా సినిమాలు చేశారు. సోలో హీరోగా బ్లాక్ బస్టర్స్ అందించారు. మాస్, కమర్షియల్ చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోయారు. కృష్ణ యాక్షన్ చిత్రాలు పెద్ద హిట్ అవుతున్నాయి. ఆయన డైలాగ్స్ థియేటర్లో బాగా పేలుతున్నాయి. మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నాయి. దీనికితోడు డాన్సులతో ఇరగదీస్తున్నారు. కానీ రమేష్ బాబులో ఆ యాంగిల్ మిస్ అయ్యింది. సాఫ్ట్ గా, కూల్‌గా కనిపించాడు, కానీ మాస్ ఆడియెన్స్ కి దూరమయ్యాడు. కృష్ణతో పోలిక