
సూపర్ స్టార్ దివంగత కృష్ణ మనువడు, మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం. సూపర్ స్టార్ దివంగత కృష్ణ (Krishna) మనువడు, మహేశ్ బాబు (Mahesh Babu) అన్న రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ (Jaya Krishna Ghattamaneni) హీరోగా నటించిన చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఆరెక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) రూపొందించగా బాలీవుడ్ బ్యూటీ రషా (Rasha Thadani) కథానాయికగా తెలుగులో అరంగేట్రం చేస్తుంది. మోహన్ బాబు ప్రతినాయక ఛాయలు ఉన్న పాత్రలో నటించగా. వైజయంతి, చందమామ కథలు బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 30న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను అమాంత పెంచేసాయి. కాగా ఆదివారం మూవీ టీం కృష్ణ స్వస్థలం బుర్రిపాలెం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను ఆదివారం రాత్రి విడుదల చేశారు. తాజాగా.. రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ రంగరించి సినిమాను రూపొందించనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. తిరుపతి నేపథ్యంలో జరిగే లవ్ స్టోరికి బళ్లారి గ్యాంగ్‌ల నడుమ జరిగే పోరాటం ఇతివృత్తంగా సినిమాను ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ ట్రైలర్‌పై ఓ లుక్ వేయండి