
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prakasam Barrage Water Levels: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్న కృష్ణా నదిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌లో కలిసిన గోదారమ్మ నీటి పరవళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటి లెక్కల వివరాలు ఆరా తీశారు. తన పర్యటనలో ఆకస్మికంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎం చంద్రబాబు నిలవడం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్‌పై సీఎం చంద్రబాబు కొద్దిసేపు తన వాహన కాన్వాయ్‌ను ఆపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు