క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్
Actor ProfileActor

క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్
Sakshi7 Oct 2026
క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లిన స్విట్జర్లాండ్

ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. 2026 ఎడిషన్‌ రౌండ్‌ ఆఫ్‌ 16లో కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4-3 గోల్స్‌ తేడాతో గెలిచి, 72 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. కెనడాలోని వాంకూవర్‌లో జరిగిన ప్రీక్వార్టర్ పోరులో నిర్ణీత 90 నిమిషాలు, అదనపు సమయం ముగిసే వరకు ఇరు జట్లు గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ 0-0తో సమంగా ముగిసింది. అనంతరం జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో స్విస్ జట్టు నెగ్గి చరిత్ర సృష్టించింది. షూటౌట్‌లో కొలంబియా తరఫున డేవిన్సన్ సాంచెజ్ కొట్టిన పెనాల్టీ క్రాస్‌బార్‌ను తాకగా, కుచో హెర్నాండెజ్ తీసిన షాట్‌ను స్విస్ గోల్‌కీపర్ గ్రెగర్ కోబెల్ అద్భుతంగా అడ్డుకున్నాడు. చివరగా రూబిన్ వర్గాస్ విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలచడంతో స్విట్జర్లాండ్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ ఒకే టోర్నీలో రెండు నాకౌట్ మ్యాచ్‌లు గెలవడం ఇదే తొలిసారి. 1954లో స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్ చేరడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు 2014 తర్వాత రెండోసారి క్వార్టర్ ఫైనల్ చేరాలన్న కొలంబియా ఆశలు అడియాశలయ్యాయి. 2018లో ఇంగ్లండ్ చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిన కొలంబియా, ఈసారి కూడా అదే విధంగా నిష్క్రమించింది. గద్వాల్ చీరలో అక్కినేని కోడలు శోభిత (ఫొటోలు) భార్యతో కలిసి హీరో నాగశౌర్య జపాన్ టూర్ (ఫొటోలు) సందడిగా నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా పెళ్లి(ఫొటోలు) Watch Live: జన హృదయ నేతకు వైఎస్ జగన్ నివాళులు నా అనుభవంతో చెప్తున్నా.. ఎవ్వరు తప్పించుకోలేరు.. సాయి కృష్ణ కేసులో వచ్చే తీర్పు ఇదే చేరిపేస్తే చెరిగి పోయే చరిత్ర కాదు ఆయనది.. మళ్లీ ఎప్పుడు పుడతావ్ రాజన్నా..! ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ఏం చేసారంటే.. అడ్వకేట్ జనార్దన్ షాకింగ్ నిజాలు

క వ ర టర ఫ నల క ద స క ళ ల న స వ ట జర ల డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in