కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు
Actor ProfilePolitician

కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు
Telugu Times14 Oct 2026
కాళేశ్వరం నీళ్లు.. పార్టీల మధ్య నిప్పులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి గోదావరి ఉరకలెత్తుతోంది. అయితే, ఈసారి నదిలో ప్రవహిస్తున్న వరద నీటి కంటే, కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ సాగుతున్న రాజకీయ వేడే ఎక్కువగా కనిపిస్తోంది. గోదావరిలో నీరు పుష్కలంగా ఉన్న తరుణంలో మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే.. ఇప్పుడు గనుక పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టు బ్యారేజీలే కుప్పకూలుతాయని అధికార కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. ఈ ప్రచార యుద్ధం వెనుక అసలు నిజాలేంటి? సాంకేతిక నివేదికలు ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల ప్రధాన వాదన ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్‌లు, బాహుబలి మోటార్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. కేవలం కొన్ని బ్యారేజీల పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. వరద నీరు వృధాగా సముద్రం పాలు కాకుండా, పంపింగ్ సిస్టమ్‌ను తక్షణమే ఉపయోగించి మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి ప్రధాన రిజర్వాయర్లను నింపాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే భయంతో, కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక వ్యర్థ కట్టడంగా చిత్రించేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం సాంకేతిక ఆధారాలతో తిప్పికొడుతోంది. పంప్ హౌస్‌లు బాగున్నాయన్నది నిజమే కావొచ్చు, కానీ వాటికి నీటిని అందించాల్సిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పునాదులు కదిలిపోయాయన్నది నగ్న సత్యమని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. దీనికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన గైడ్‌లైన్స్, మధ్యంతర నివేదికలను చూపిస్తోంది. గత ఏడాది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలో ఊటలు రావడం వంటి తీవ్రమైన ఘటనల తర్వాత ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగకుండా, పునాదుల కింద గ్రౌటింగ్ పూర్తికాకుండా బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరమని