క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు
Actor ProfilePolitician

క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు
Oneindia Telugu9 Jan 2027
క్లాస్ రూమ్ లో కామాంధుడు.. తుక్కు రేగగొట్టిన విద్యార్ధులు

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత మార్గంలో నడిపించాల్సిన ఒక ఉపాధ్యాయుడు బుద్ధి గడ్డితిని కీచకుడిగా మారాడు. నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో తీవ్ర కలకలం రేపిన ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్నే రేపింది. కళాశాలలో తెలుగు బోధిస్తున్న భాస్కర్ అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడనే వార్త తీవ్ర ఆగ్రహజ్వాలలకు దారితీసింది. గురువు స్థానానికి కలంకం తెచ్చేలా వ్యవహరిస్తున్న ఆ ఉపాధ్యాయుడి తీరుపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.లెక్చరర్ భాస్కర్ వేధింపులు తాళలేక విద్యార్థినులు కళాశాల గేటు ముందు బైఠాయించి పెద్దెత్తున ఆందోళనకు దిగారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి చేరుకుని విద్యార్థినుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కళాశాల ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల నిరసనతో ఆ ప్రాంతంలో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేహశుద్ధి చేసి, అరగుండు, చెప్పులదండలతో యువకుడి ఊరేగింపు.. అనంతపురంలో ఘటన! కీచకుడికి వికటించిన పాపం!ఆందోళన జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన లెక్చరర్ భాస్కర్‌ను చూసిన విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. పదేపదే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న ఆ కీచక ఉపాధ్యాయుడికి అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. గుణపాఠం చెప్పాల్సిందేనంటూ అతడిని పట్టుకుని నిలదీశారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తెచ్చారు. రక్షణగా నిలిచి భాస్కర్‌ను అక్కడి నుంచి తరలించారు.దేహశుద్ధి చేసి, అరగుండు, చెప్పులదండలతో యువకుడి ఊరేగింపు.. అనంతపురంలో ఘటన! పోలీసుల హామీ.. విచారణ వేగవంతం!ఘటనపై పోలీసులు స్పందిస్తూ కళాశాలలో శాంతిభద్రతలను పునరుద్ధరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, సదరు ఉపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తేలితే చట్టప్రకారం కఠిన