కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 69 మంది మృతి
Actor ProfilePolitician

కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 69 మంది మృతి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 69 మంది మృతి
AP7AM29 Nov 2026
కొలంబియాను కుదిపేసిన భారీ భూకంపం.. 69 మంది మృతి

పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో నమోదైన ఈ భూప్రకంపనల కారణంగా 69 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పల్మార్ పట్టణానికి సమీపంలో, భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూకంప తీవ్రతకు పెరీరా, కాలి, క్విబ్డో, మనీజల్స్ వంటి నగరాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క పెరీరా నగరంలోనే 18 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. మనీజల్స్‌లోని చారిత్రక నియో-గోతిక్ కేథడ్రల్ టవర్ ఒకటి కూలిపోయింది. భూకంపం ప్రభావం పొరుగు దేశమైన ఈక్వెడార్‌లో కూడా కనిపించింది.భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మనీజల్స్, క్విబ్డో సహా ఆరు విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి. రాజధాని బొగోటాలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.రంగంలోకి దిగిన ప్రభుత్వంకొలంబియా నూతన అధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా వెంటనే సహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ విపత్తు నిర్వహణ విభాగంలో యూనిఫైడ్ కమాండ్ పోస్ట్‌ను ఏర్పాటు చేసి, నష్టాన్ని అంచనా