
దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు, దుబ్బాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామక్కపేట-లచ్చపేట రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక సీఐ రాజేష్, ఎస్ఐ కీర్తిరాజు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎక్కడో మహిళను చంపి ఇక్కడికి తీసుకువచ్చి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతి చెందిన మహిళ వివరాలు తెలియ రాలేదు. సంఘటన స్థలాన్ని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు