
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతుంది. యువత మాత్రమే కాకుండా పెద్దవారు సైతం మిస్టరీ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు..థియేటర్లలో చూడలేకపోయిన సినిమాలను ఇంట్లోనే చూసే అవకాశాన్ని ఓటీటీలో కల్పిస్తున్నందున ఆ జానర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కన్నై నంబత్తే. నిజానికి ఇది తమిళ సినిమా. కానీ తెలుగు డబ్బింగ్ సైతం అందుబాటులో ఉంది. కథలోని మలుపులు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేయడంతో, ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ‘కన్నై నామతే’ చిత్రానికి ఎం. మారన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించగా, ప్రసన్న, భూమిక, శ్రీకాంత్ అనేక ఇతర కళాకారులు ఇందులో నటించారు. ఇది ప్రధానంగా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఒక సాధారణ వ్యక్తి అనుకోకుండా ఒక హత్య కేసులో ఎలా చిక్కుకుంటాడో ఈ సినిమా వివరిస్తుంది. ఈ కథలో ప్రధాన పాత్రను ఉదయనిధి స్టాలిన్ పోషించారు. అద్దె ఇంట్లో నివసించే అరుణ్, ఆ ఇంటి యజమాని కూతురితో ప్రేమలో పడతాడు. ఈ విషయం ఆమె తండ్రికి తెలియగానే, అతను ఆ ఇంటిని ఖాళీ చేయిస్తాడు. అప్పుడు అరుణ్ వేరొక అద్దె ఇంటికి మారతాడు. తన కొత్త ఇంట్లో, అరుణ్ సోము అనే వ్యక్తిని కలుస్తాడు. వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. కానీ ఒక రాత్రి, అరుణ్ మద్యం సేవించి తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. రోడ్డుపై కవిత అనే మహిళ ప్రమాదానికి గురవ్వడం అరుణ్ చూస్తాడు. ఆమెకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, అరుణ్ ఆమెను తన కారులో ఎక్కించుకుని ఇంటి దగ్గర దింపుతాడు. ఇక్కడి నుండి కథ వేరే మలుపు తీసుకుంటుంది. మరుసటి రోజు అరుణ్‌కు పెద్ద షాక్ తగులుతుంది. అదే కారులో కవిత శవమై కనబడుతుంది. రాత్రి వరకు