కార్లు కడిగితే భారీగా ఫైన్
Actor ProfilePolitician

కార్లు కడిగితే భారీగా ఫైన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కార్లు కడిగితే భారీగా ఫైన్
Oneindia Telugu19 Sept 2026
కార్లు కడిగితే భారీగా ఫైన్

దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగానైనా కేరళ తీరాన్ని తాకినప్పటికీ ఆ తర్వాత వాటి కదలికలు మందగించాయి. ఉత్తరాదిన చెప్పుకోదగ్గ వర్షాలు పడుతున్నప్పటికీ.. దక్షిణాదిలో వాటి జాడే కరవైంది. బంగాళాఖాతంలో ఏర్పడుతోన్న ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో అడపాదడపా వర్షాలు పడుతున్నా.. ఈ లోటు భర్తీ కావట్లేదు. దక్షిణాది రాష్ట్రాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.ఈ పరిణామాల మధ్య కర్ణాటక ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. బెంగళూరులో రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు బెంగళూరు జలమండలి నూతన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవన వర్షాలలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉండటం వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. నగర వ్యాప్తంగా తాగునీటి వనరులను కాపాడుకోవడమే లక్ష్యంగా తక్షణ ఆదేశాలను ఇచ్చింది.వర్షపాతం తగ్గినా లేదా ఆలస్యమైనా నగరవాసులకు తాగునీటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈ రక్షణాత్మక చర్యలు చేపట్టింది. నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించింది. గృహాలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థలను ఈ నిబంధనల పరిధిలోకి వచ్చాయి. వాహనాలు కడగడానికి అనుమతి లేదు. రోడ్లు, ఫుట్‌పాత్‌లను శుభ్రం చేయడానికి నీటిని వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించారు.పబ్లిక్/ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌లో తాగునీటిని నింపడంపై కూడా కఠినమైన ఆంక్షలు విధించారు. వీటికి ప్రత్యామ్నాయంగా రీసైకిల్ లేదా శుద్ధి చేసిన నీటిని మాత్రమే వాడాల్సి ఉంటుంది. తోటల పెంపకం, భవన నిర్మాణ రంగ కార్యకలాపాలకు కూడా ఈ రీసైకిల్ నీటినే ఉపయోగించాలి. నిబంధనలు ఉల్లంఘించి తాగునీటి పైపులను సాధారణ పనుల కోసం ఉపయోగిస్తే జలమండలి నిఘా బృందాలు చర్యలు చేపడతాయి.నీటిని పొదుపుగా వాడుకునేందుకు వీలుగా, భవనాల్లోని నీటి కనెక్షన్లకు ప్రవాహాన్ని నియంత్రించే ఏరేటర్లను (ఫ్లో రెస్ట్రిక్టర్లు) అమర్చాలి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య కట్టడాలు, కార్యాలయాలు, హోటళ్లు, పరిశ్రమలు తమ నల్లాలకు ఈ ఏరేటర్లను అమర్చుకోవాలని బెంగళూరు వాటర్ బోర్డు స్పష్టం చేసింది. వీటిని వాడటం వల్ల