కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే
Actor ProfileActor

కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే
TV9 Telugu10 Oct 2026
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు మూత పడటానికి అసలు కారణాలు ఇవే

సినీ రంగంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పచ్చళ్ల ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా, జబర్దస్త్ ఫేమ్ కిరాక్ RP ప్రారంభించిన "నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు" వ్యాపారం ఎందుకు విఫలమైందో ప్రకాష్ స్పష్టం చేశారు. కిరాక్ RPకి ఫుడ్ బిజినెస్‌లో సహాయం చేయడానికి ప్రకాష్ ముందుకు వచ్చారు. నాలుగు ఐటమ్స్‌తో వ్యాపారం ప్రారంభించాలని RP అనుకున్నప్పుడు, ప్రకాష్ అది సాధ్యం కాదని, క్వాలిటీ, టేస్ట్ మెయింటైన్ చేస్తూ కర్రీ పాయింట్ పెట్టమని సలహా ఇచ్చారు. ప్రకాష్ సహాయంతో కిచెన్ ఓపెనింగ్ చేసి, నాలుగు బ్రాంచ్‌లు కూడా ప్రారంభించారు. ఆపై తనకున్న పరిచయాలు, ఫేమ్‌తో వ్యాపారాన్ని బ్రాంచులుగా విస్తరించారు. డబ్బు కట్టిన వారికి బ్రాంచులు ఇచ్చాడు. అయితే క్వాలిటీతో పాటు ధర విషయంలో నెట్టింట చాలామంది కామెంట్స్ పెడుతూ వచ్చారు. దీంతో తర్వాతికాంలో.. వ్యాపారం సరిగా నడవకపోవడంతో RP వాటిని నిలబెట్టుకోలేకపోయారు. చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు వంటివి సరిగా లేవని కస్టమర్లు ఫిర్యాదులు చేసినా, RP వాటిని సరిదిద్దుకోవడంలో విఫలమయ్యారని ప్రకాష్ తెలిపారు. నాణ్యత, నిలకడైన రుచిని అందించడంలో లోపం వల్లే అన్ని బ్రాంచ్‌లు మూతపడ్డాయని, RP స్వయంగా తన వ్యాపారాన్ని నాశనం చేసుకున్నారని ప్రకాష్ అభిప్రాయపడ్డారు. తన చేపల దుకాణాలు బంద్ పెట్టిన ఆర్పీ ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. పచ్చళ్ల ప్రకాష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో నాణ్యత, నిబద్ధతలకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో వివరించారు. 40 ఏళ్లుగా షూటింగ్‌లకు ఫుడ్ సప్లై చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం నాణ్యత, శుభ్రత, రుచిని ఎప్పుడూ కాపాడుకోవడమేనని అన్నారు. క్యాటరింగ్ వ్యాపారంలో కూడా ఇదే సూత్రాన్ని పాటించి విజయం సాధించానని పేర్కొన్నారు. డబ్బు కంటే పేరే ముఖ్యమని, పేరు వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని ఆయన ఉద్ఘాటించారు. ఈ ఇంటర్వ్యూలో ప్రకాష్ గారు