కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్
Actor ProfileActor

కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్
123Telugu17 Nov 2026
కొరియన్ కనకరాజు’కు ఓవర్సీస్ సాలిడ్ రెస్పాన్స్.. డబుల్ సెంచరీ మార్క్ క్రాస్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. గాంధీ మేర్లపాక దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎంటర్‌టైనర్, యూఎస్‌ఏలో ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. అక్కడ ఇప్పటికే ఈ సినిమా 200K డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా అక్కడ మరింత సాలిడ్ రన్‌ను కంటిన్యూ చేయనుండటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓవర్సీస్ విడుదల బాధ్యతలను నిర్వహించగా, అన్ని థియేటర్లలో పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి థమన్ అందించిన సంగీతం, యూవీ క్రియేషన్స్ నిర్మాణం అదనపు ఆకర్షణగా నిలిచాయి. యుఎస్‌ఏ ఆడియెన్స్ ఈ కామెడీ థ్రిల్లర్‌కు బ్రహ్మరథం పడుతుండటంతో రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరింత భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది