కోరంగి ఓడరేవు వైభవం.. దాచేస్తే దాగని సత్యం
Actor ProfilePolitician

కోరంగి ఓడరేవు వైభవం.. దాచేస్తే దాగని సత్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోరంగి ఓడరేవు వైభవం.. దాచేస్తే దాగని సత్యం
TeluguOne18 Nov 2026
కోరంగి ఓడరేవు వైభవం.. దాచేస్తే దాగని సత్యం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రాచీన తీర ప్రాంతమైన కోరంగి (కొరింగ) ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, సాంకేతికంగా ముందంజలో ఉన్న నౌకా నిర్మాణ కేంద్రంగా విరాజిల్లింది. నాటి కాలంలోనే ఇక్కడి శిల్పులు తయారు చేసే నావలు అత్యుత్తమ నాణ్యతతో, సముద్ర ప్రయాణాలకు అత్యంత అనుకూలంగా ఉండేవి. అయితే 1839 నవంబరు 25న సంభవించిన పెను ఉప్పెన ఈ చారిత్రక నగర వైభవాన్ని అట్టడుగుకు తొక్కేసింది. దాదాపు 40 అడుగుల ఎత్తున లేచిన రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తడంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా.. దాదాపు 20వేల నౌకలు నీటిపాలు అయ్యయి. ఈ పెను విపత్తు భారత వాణిజ్య రంగానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఉప్పెన తీవ్రత, నౌకా రంగానికి జరిగిన భారీ నష్టం1839 నాటి ప్రకృతి విపత్తులో సంభవించిన నష్టం అపారమైనది. స్థానిక నౌకాశ్రయంలో లంగరు వేసి ఉన్న నౌకలతో పాటు అనేక బోట్లు ఈ ఉప్పెన ధాటికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల మందికి పైగా ప్రజలు మరణించారని, అలాగే సుమారు 20 వేల వరకు చిన్న, పెద్ద నౌకలు సముద్రంలో మునిగిపోయాయని లేదా కొట్టుకుపోయాయని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ గణాంకాలు నాటి కోరంగి ప్రాంతంలో నౌకా పరిశ్రమ ఎంత భారీ స్థాయిలో విస్తరించి ఉండేదో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యూరప్ దేశాల్లోని నౌకాశ్రయాల కంటే ఎంతో ముందే గోదావరి తీరంలో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య కార్యకలాపాలు సాగాయి. బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక కుట్రలు, అణచివేత ధోరణి కోరంగి నౌకా నిర్మాణం అక్కడి వ్యాపార వృద్ధి లండన్ నౌకాశ్రయం, బ్రిటిష్ వ్యాపారులకు అతిపెద్ద పోటీగా మారాయి. భారత నౌకల నాణ్యతతో బ్రిటన్‌లో తయారయ్యే నౌకలు పోటీ పడలేకపోయేవి. ఈ క్రమంలో భారత నౌకా రంగాన్ని దెబ్బతీయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తీవ్రమైన పన్నుల భార మోపడం, నిబంధనలను కఠినతరం చేయడం వంటి కుట్రలకు పాల్పడింది. స్వదేశీ

క ర గ ఓడర వ వ భవ ద చ స త ద గన సత య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in