ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేరళకు వెళుతున్నారు.. శుక్రవారం నుంచి 20 రోజుల పాటూ అక్కడే ఉంటారని తెలుస్తోంది. కేరళలోని ప్రకృతి వైద్య చికిత్స కేంద్రానికి వెళతారు. పవన్ కళ్యాణ్ తరచూ ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు.. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్, అలసటతో పాటుగా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఆగస్టు 15 రోజున కూడా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు.. ఇలా వరుసగా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా కేబినెట్ సమావేశాలతో పాటు పలు కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. అందుకే ఆయన కేరళలో ప్రకృతి వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఆయన అమరావతిలో అధికారులతో సమావేశమైన సమయంలో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. వెంటనే ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.. అనంతరం వైద్యులు పరీక్షించి సైనసైటిస్ కారణంగా ఇబ్బందిపడ్డారని తేల్చారు. ముక్కుకు సర్జరీ చేయాలని సూచించడంతో అపోలోలో చేరారు.. అక్కడ సైనసైటిస్‌కు సంబంధించి సర్జరీ చేశారు.. అనంతరం వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆ తర్వాత ఆయన కోలుకుని అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు.అంతేకాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి.. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో జులై నెలలో ఆయన కుడి భుజానికి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ చేశారు. ఒకేసారి రెండు భుజాలకు ఒకేసారి సర్జరీ చేస్తే ఇబ్బందిపడతారని.. ముందు కుడి భుజానికి సర్జరీ చేశారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ భుజానికి 2016లో గాయాలయ్యాయి. .డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించినా సరే ఆయన పట్టించుకోలేదు.పవనక కళ్యాణ్ వరుసగా సమావేశాలు, 2018లో పోరాట యాత్ర చేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌తో కరచాలనం చేయాలని కొంతమంది అభిమానులు
Actor ProfilePolitician
కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 20 రోజుల పాటూ అక్కడే
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•24 Jan 2027
కేరళకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. 20 రోజుల పాటూ అక్కడే