
ఏపీకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సియోల్‌లో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్‌తో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించారు. ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తూ, పలు వ్యూహాత్మక ప్రతిపాదనలను వారి ముందు ఉంచారు.కియాతో ఉన్నత స్థాయి సమావేశం.. భారీ విస్తరణకు ఆహ్వానంసియోల్‌లో కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఆపరేషన్స్) టే హన్ లీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందంతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, అనంతపురంలో ఇప్పటికే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కియా, రాష్ట్రంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేశ్ ప్రతిపాదించారు. కియా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న ప్లాట్‌ఫామ్ బియాండ్ వెహికల్ (పీబీవీ) వాహనాల ఉత్పత్తిని కూడా ఏపీలో చేపట్టాలని సూచించారు.అంతర్జాతీయ మార్కెట్లకు సులభంగా ఎగుమతులు చేసేందుకు వీలుగా విశాఖపట్నం పోర్టు సమీపంలో ఒక సీకేడీ (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు, ఈ-జీఎంపీ ప్లాట్‌ఫామ్ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్‌లు, ఈవీ ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక ఈవీ-కాంపోనెంట్ల తయారీ కేంద్రాన్ని, పవర్‌ట్రెయిన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ కోసం ఒక ఈవీ పవర్‌ట్రెయిన్ టెస్టింగ్ కేంద్రాన్ని కూడా స్థాపించాలని కోరారు.మంత్రి లోకేశ్