
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి (Russia-Ukraine war) మద్దతుగా తమ సైన్యాన్ని రష్యాకు పంపినట్లు ఉత్తర కొరియా (North Korean troops) ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఆ దేశం నుంచి మాస్కోకు 50వేల మంది సైనికులను పంపడానికి సన్నాహాలు చేస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) ఆరోపించారు. మొదట్లో వందల సంఖ్యలో యుద్ధంలో పాల్గొన్న కిమ్ సేనలు.. ప్రస్తుతం వేల సంఖ్యలో కనిపిస్తున్నారని అన్నారు. దాడుల్లో పాల్గొంటూనే వారు యుద్ధ తంత్రాలను అధ్యయనం చేస్తున్నారని.. ఇది ఇలాగే కొనసాగితే ఇతర ఆసియా దేశాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. వారు రష్యా ఆధ్వర్యంలో ఆధునిక యుద్ధంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో అనుభవాన్ని పెంచుకున్న అనంతరం.. రష్యా నుంచి లైసెన్సులు పొంది..వారి నుంచి అన్ని రకాల సైనిక పరికరాలను పొందడానికి కిమ్ వ్యూహరచన చేసినట్లు ఆరోపించారు. తమ దేశంపై రష్యా చేసిన దాడుల్లో ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులు వాడినట్లు తమ సైన్యం కనుగొందని తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యాను ఎదుర్కోవడానికి తమకు సహకరించాలని జెలెన్‌స్కీ దక్షిణ కొరియాను కోరారు. గగనతల రక్షణ వ్యవస్థల విషయంలో దేశం కొరతను ఎదుర్కొంటోందని.. ఆయా రంగాల్లో ఆ దేశం నుంచి మద్దతు పొందాలని భవిస్తున్నట్లు వెల్లడించారు. యుద్ధంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు జెలెన్‌స్కీ దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సెర్బియా (Serbia) పర్యటనకు వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌తో భేటీ అనంతరం మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్‌లో చేరాలనే ఉమ్మడి లక్ష్యం కోసం ఇరు దేశాలు కలిసి పని చేస్తాయన్నారు. ఉక్రెయిన్‌కు మానవతా సహాయం, మౌలిక సదుపాయాలు, ఇంధన రంగానికి సంబంధించిన పరికరాలను అందించడానికి సెర్బియా ప్రభుత్వం అంగీకరించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త