కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్
Actor ProfilePolitician

కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్
Sakshi17 Dec 2026
కిమీ రేంజ్ అందించే స్కూటర్ లాంచ్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ అయిన యాంపియర్, 30కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో కూడిన 'మాగ్నస్ జి మ్యాక్స్' అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.10 లక్షలు కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త సిన్నమోన్ కాపర్ కలర్ ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. మాగ్నస్ జి మ్యాక్స్‌లో ఇప్పుడు హిల్ హోల్డ్, క్రూజ్ కంట్రోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రద్దీగా ఉండే పార్కింగ్ ప్రదేశాలలో యజమానులు స్కూటర్‌ను గుర్తించడంలో సహాయపడే ఫైండ్ మై స్కూటర్ అండ్ పింగ్ మై స్కూటర్ వంటి భద్రతా ఫీచర్లు కూడా దీనికి లభిస్తాయి. యాంపియర్ కనెక్ట్ యాప్‌తో మెరుగైన కనెక్టివిటీ కోసం ఈ స్కూటర్‌లో అప్‌డేట్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ ఉంది. నావిగేషన్, ఇతర వాహన సమాచారాన్ని కొత్త 5 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో చూడవచ్చు. ఇతర కనెక్టెడ్ ఫీచర్లలో రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేటస్, లైవ్ ట్రాకింగ్, జియో ఫెన్సింగ్, తెఫ్ట్ అండ్ టో అలర్ట్‌లు, రిమోట్ వెహికల్ డయాగ్నోస్టిక్స్, సర్వీస్ బుకింగ్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్‌సైట్స్ ఉన్నాయి. మాగ్నస్ జి మ్యాక్స్‌కు ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు కూడా లభిస్తాయి. ఇవి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను రిమోట్‌గా ఇన్‌స్టాల్ చేయడానికి.. స్కూటర్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని సాఫ్ట్‌వేర్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సహాయపడతాయి. మాగ్నస్ జి మ్యాక్స్ 3 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 2.4 kW మోటార్‌ను కలిగి ఉంది. సర్టిఫైడ్ రేంజ్ 142 కిమీ. రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కి.మీ.లు. బ్యాటరీకి 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీ.ల వారంటీ వర్తిస్తుంది. కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా