కిమ్ మీద ప్రేమతో.. దక్షిణ కొరియాకు షాకిచ్చిన ట్రంప్
Actor ProfilePolitician

కిమ్ మీద ప్రేమతో.. దక్షిణ కొరియాకు షాకిచ్చిన ట్రంప్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కిమ్ మీద ప్రేమతో.. దక్షిణ కొరియాకు షాకిచ్చిన ట్రంప్
Eenadu3 Jan 2027
కిమ్ మీద ప్రేమతో.. దక్షిణ కొరియాకు షాకిచ్చిన ట్రంప్

Donald Trump | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ విషయంలో అమెరికాకు మద్దతుగా నిలవడానికి మిత్రదేశం దక్షిణ కొరియా విముఖత వ్యక్తం చేసింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump).. దక్షిణకొరియాకు షాకిచ్చారు. ఆ దేశంతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని తమ రక్షణ శాఖను ఆదేశించారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో ఉన్న బంధం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్‌ చెప్పడం గమనార్హం. ఈ మేరకు ఆయన తన ట్రూత్‌ ఖాతాలో పేర్కొన్నారు. ‘‘కిమ్‌(Kim Jong Un)తో నాకున్న మంచి స్నేహ బంధం దృష్ట్యా దక్షిణ కొరియాతో అమెరికా చేపట్టాల్సిన సంయుక్త సైనిక చర్యలను తగ్గించాలని అనుకుంటున్నా. ఈ విన్యాసాలు ఖర్చుతో కూడుకున్నవని, దీనికి ఎక్కువ వ్యయాన్ని అమెరికానే భరిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకోవడం ఆలస్యమైంది. ఇక, ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని అడ్డుకునే చర్యల్లో అమెరికాతో కలిసి రావాలని దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడిని కోరగా.. ఆయన రాలేమని చెప్పారు’’ అని ట్రంప్‌ రాసుకొచ్చారు. కాగా.. ఈ పోస్ట్‌కు కొద్ది గంటల ముందు కిమ్‌తో 2019లో దిగిన ఓ ఫొటోను ట్రంప్‌ పంచుకున్నారు. ఇక, జపాన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ వంటి మిత్రదేశాలు కూడా ఇరాన్‌ విషయంలో అమెరికా(United States of America)కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంపై వెనుకంజ వేస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. ‘ఉల్చి ఫ్రీడం షీల్డ్‌’ పేరుతో అమెరికా-దక్షిణ కొరియా ఇటీవల సంయుక్త సైనిక విన్యాసాలు ప్రకటించాయి. సోమవారం నుంచి 11 రోజులపాటు ఇవి జరగనున్నాయి. ఇందులో సుమారు 18 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. అయితే ఈ విన్యాసాలు షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతాయని సియోల్‌ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. 2018లో కిమ్‌తో అణు చర్చలు జరిపిన సమయంలోనూ ట్రంప్‌.. అమెరికా-దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను నిలిపివేశారు. తాజాగా కిమ్‌తో

క మ మ ద ప ర మత దక ష ణ క ర య క ష క చ చ న ట ర ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in