కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు
Actor ProfilePolitician

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు
TeluguOne25 Dec 2026
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడే దాంట్లో తప్పేం లేదు

కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అని అభివర్ణించారు. గత రెండున్నరేళ్లలో మంత్రి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ అడగలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారని, అందులో తప్పేమీ లేదన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఆయన బాధ్యతగా భావిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలో కొన్ని సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని, వాటిని అంతర్గతంగా సరిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీకే మంచిదని అనిరుధ్ రెడ్డి అన్నారు. పార్టీకి మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే రాజగోపాల్ రెడ్డి తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా చూడకుండా, ప్రజా సమస్యలపై చర్చగా తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుని పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అమ్మవారి సన్నిధిలో మైనర్ బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన..!